రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ.. బుల్లెట్ బండితో పోల్చుతూ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్, బీజేపీల బీ టీమ్ అని చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. రాహుల్ కామెంట్స్ పై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఓవైసీ.. 'ఊహించినట్లుగానే రాహుల్ బాబా బీ-టీమ్ ఏడ్పు మొదలెట్టారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్, బీజేపీల బీ టీమ్ అని చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. రాహుల్ కామెంట్స్ పై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఓవైసీ.. 'ఊహించినట్లుగానే రాహుల్ బాబా బీ-టీమ్ ఏడ్పు మొదలెట్టారు. మరి రాహుల్ తన అమేథీ సీటును బీజేపీకి ఎందుకు బహుమతిగా వదులుకున్నారు?. మీరన్నట్లుగా తెలంగాణలో బీజేపీకి రెండు బీ టీమ్స్ ఉంటే ఇక్కడ బీజేపీ ఎందుకు బలహీనంగా ఉంది? రాహుల్ సేఫ్ సీటు కోసం వయనాడ్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని నిలదీశారు.
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్(ఆర్ఎస్ఎస్) కలిసి గెలిచే సీట్ల కంటే తన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయని’ ఎద్దేవా చేశారు. మరో వైపు తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటే అని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాయని దుయ్యబడుతున్నారు.