కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరో కీలక పథకం.. ఇక ప్రకటించడమే ఆలస్యం?

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఓల్డ్ పెన్షన్ పథకాన్ని పొందుపరచనున్నారు. దీంతో పాటు ట్రాన్స్ జెండర్లకూ ఒక సంక్షేమ పథకాన్ని పెట్టాలని మేనిఫెస్టో కమిటీ ఆలోచిస్తున్నది.

Update: 2023-10-09 15:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఓల్డ్ పెన్షన్ పథకాన్ని పొందుపరచనున్నారు. దీంతో పాటు ట్రాన్స్ జెండర్లకూ ఒక సంక్షేమ పథకాన్ని పెట్టాలని మేనిఫెస్టో కమిటీ ఆలోచిస్తున్నది. పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళా సంఘాలు, యూత్‌తో పాటు వివిధ రంగాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోలో పెట్టేందుకు కసరత్తు జరుగుతున్నది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో మేనిఫెస్టో కమిటీ మరోసారి భేటీ అయింది. చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో వివిధ వర్గాల నుంచి వచ్చిన అంశాలపై సుదీర్ఘంగా జర్చ జరిగింది. జిల్లాల్లో సేకరించిన అంశాలతో పాటు గాంధీభవన్ మేనిఫెస్టో రూమ్ నుంచి వచ్చిన ప్రతిపాదలను కమిటీ సభ్యులు ఒక్కొక్కరూ అభిప్రాయాలను వ్యక్త పరిచారు.


టీపీసీసీతో డిస్కషన్ అనంతరం మేనిఫెస్టోలో చేర్చుతామని చైర్మన్ శ్రీధర్ బాబు తెలిపారు. ఇక మేనిఫెస్టో కమిటీ మీటింగ్ సమయంలో తమకూ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు కావాలని డోమెస్టిక్, గార్బేజ్ వర్కర్లు, గిగ్ వర్కర్లు, ఉద్యమకారులు, టూర్స్, ట్రావెల్స్ డైవర్స్ యూనియన్, క్యాబ్ యూనియన్లు, స్ట్రీట్ వెండర్ల, రిటైర్డ్ స్కూల్ ఎంప్లాయిస్ యూనియన్లు శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఆయా వర్గాలకు అవసరం మేరకు ప్రత్యేక స్కీమ్‌లను ప్రతిపాదించారు. ఈ మీటింగ్‌లో సభ్యులు జానక్ ప్రసాద్, రవళి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, ప్రో జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News