సింహం సింగిల్‌గానే వస్తుంది: KTR

బీఆర్ఎస్‌కు ఎవరితో పొత్తు అవసరం లేదని.. ఒంటరిగానే వస్తున్నాం.. మళ్లీ హాట్రిక్ కొడుతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుందని.. సింగిల్‌గానే సత్తా చాటుతామని అన్నారు. అనంతరం క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి లేఖ రాయ‌డంపై కేటీఆర్ స్పందించారు.

Update: 2023-11-04 11:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌కు ఎవరితో పొత్తు అవసరం లేదని.. ఒంటరిగానే వస్తున్నాం.. మళ్లీ హాట్రిక్ కొడుతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుందని.. సింగిల్‌గానే సత్తా చాటుతామని అన్నారు. అనంతరం క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి లేఖ రాయ‌డంపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగ‌ళూరుకు త‌ర‌లించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. నాలుగేండ్లు వెంబ‌డి ప‌డి తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఒప్పించుకున్నాం.. హైద‌రాబాద్‌కు వ‌చ్చి సీఎం కేసీఆర్‌ను క‌లిసి ఫ్యాక్టరీ పెడుతామని ప్రక‌టించారు. ఒక ల‌క్ష మందికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌న్నారు.

రంగారెడ్డి జిల్లా క‌లెక్టరేట్ ఎదురుగా కొంగ‌ర‌కొలాన్‌లో 200 ఎక‌రాల స్థలంలో నిర్మాణం ప్రారంభించారు. రెండు అంత‌స్తులు పూర్తయ్యాయి. వ‌చ్చే ఏప్రిల్, మే నెల‌లో ఫాక్స్ కాన్ కంపెనీ ప్రారంభం కానుంది అని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి సమయంలో క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి అక్టోబ‌ర్ 25న లేఖ రాయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ చేతిలో మ‌న జుట్టు ఉంటే ప‌రిస్థితి ఇలానే త‌యార‌వుతుందని అన్నారు. కాంగ్రెస్‌కు బెంగ‌ళూరు అడ్డా అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీలో కాకుండా, బెంగ‌ళూరులో కూడా డిసైడ్ అవుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News