MP కోమటిరెడ్డితో వేముల వీరేశం సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని కోమటిరెడ్డి నివాసంలో ఆదివారం ఇరువురు సమావేశమయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని కోమటిరెడ్డి నివాసంలో ఆదివారం ఇరువురు సమావేశమయ్యారు. కాగా, ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే పాల్గొన్నారు. అయితే, వీరేశం చేరిక సమయంలో కోమటిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇవాళ స్వయంగా కలిసి కోమటిరెడ్డి ఆశీర్వాదం తీసుకున్నట్లు సమాచారం. కాగా, వీరేశం నకిరేకల్ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నారు.