‘మీ కలలు నెరవేరుస్తా.. కాంగ్రెస్‌ను గెలిపించండి’

విద్యార్థి, ప్రజా పోరాటాల ద్వారా సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ దోపిడీలకు పాల్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన కోరారు.

Update: 2023-11-05 16:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థి, ప్రజా పోరాటాల ద్వారా సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ దోపిడీలకు పాల్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉద్యమ నేత కోట శ్రీనివాస్ నేతృత్వంలో ఓయూ, కేయూ విద్యార్థి నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం అన్ని ఖాళీలను నింపుతామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు సరైన సమాచారం అందజేస్తామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు స్పష్టమైన ప్రణాళిక కాంగ్రెస్ దగ్గర ఉన్నదన్నారు. నెల రోజులు నిరుద్యోగులంతా కష్టబడి కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.

ఒక్కో నిరుద్యోగి రెండు మూడు ఓట్లు వేపించినా, కాంగ్రెస్‌కు దాదాపు 90 లక్షల ఓట్లు పడతాయని స్పష్టం చేశారు. కంకణం కట్టుకొని పని చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ నేత కోట శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తమ జీవితాలను పణంగా పెట్టి కొట్లాడితే, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే అధ్వానమైన పరిస్థితులను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. ఇంటికో ఉద్యోగం వస్తది అనుకున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నాయన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన టీఎస్ పీఎస్సీ బోర్డు నిర్లక్ష్యంగా వ్యహరించిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు తెలంగాణ విద్యార్థి సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పెంచాల సతీష్, ఎస్ ఎఫ్​ ఐ మాజీ ఓయూ అధ్యక్షులు డాక్టర్ మాండ్ల రవి, టీవైఎఫ్​రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రాజ్, టీవీఎస్ కాకతీయ యూనివర్సిటీ నాయకులు కూనూరి రంజిత్, కే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News