BJP థర్డ్ లిస్ట్‌కు ముహూర్తం ఖరారు.. ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ!
వచ్చే ఎన్నికల బరిలో నిలిపేందుకు అభ్యర్థుల వెతుకులాటలో బీజేపీ నిమగ్నమైంది. ఇప్పటికే రెండు విడుతల్లో 53 మందిని ప్రకటించిన కమలం పార్టీ థర్డ్ లిస్ట్‌పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల బరిలో నిలిపేందుకు అభ్యర్థుల వెతుకులాటలో బీజేపీ నిమగ్నమైంది. ఇప్పటికే రెండు విడుతల్లో 53 మందిని ప్రకటించిన కమలం పార్టీ థర్డ్ లిస్ట్‌పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసంలో రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జీ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర ఇన్‌చార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సహా ఇన్‌చార్జి అరవింద్ మీనన్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. కాంట్రవర్సీకి తావు లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. క్యాండిడేట్లను ప్రకటించని సెగ్మెంట్లకు చెందిన ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సస్పెన్స్‌కు నవంబర్ ఫస్టున లేదా ఆ తర్వాతే బ్రేక్ పడే చాన్స్ ఉంది.
ఇతర పార్టీల్లోని అసంతృప్తులను చేర్చుకోవడంలో భాగంగానే బీజేపీ అభ్యర్థుల జాబితా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ప్రకటించిన అనంతరం హస్తం పార్టీలో అసంతృప్తులకు గాలం వేయాలని బీజేపీ భావిస్తోంది. అందరినీ చేర్చుకుని ఆ తర్వాతే జాబితా విడుదల చేయాలని చూస్తోంది. ఇదిలా ఉండగా జనసేనతో పొత్తు అంశంపైనా ముఖ్య నేతల భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లేకుండానే ఈ డిస్కషన్ జరిగింది. బీజేపీ, జనసేనకు మధ్య పొత్తు కుదిరితే వారికి ఎన్ని స్థానాల్లో టికెట్లు కేటాయించాలనే అంశంపై డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.
కాగా జనసేన ఇప్పటికే 32 మంది అభ్యర్థులను ప్రకటించింది. వారికి కూడా నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే సగం సీట్లయినా ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. 12 నుంచి 15 సీట్లు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థానాలు ఎక్కడనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే జనసేనకు టికెట్ ఇస్తే.. ఆ సెగ్మెంట్ లో ఉన్న బీజేపీ నేత పరిస్థితి ఏంటనేది పలువురిని వెంటాడుతోంది. అలాగే ఇప్పటికే 32 మంది అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. పొత్తులో తమ సీటు ఎక్కడ బీజేపీకి వెళ్తుందోననే డైలమాలో ఉన్నారు. ఇరు పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సస్పెన్స్‌కు నవంబర్ 1వ తేదీన జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంతో చెక్ పడనుంది.
కాచిగూడలోని కిషన్ రెడ్డి నివాసంలో భేటీ అయిన కీలక నేతలు ప్రధానంగా గ్రేటర్ పరిధిలోని సీట్ల అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. సనత్ నగర్ నుంచి పోటీకి మర్రి శశిధర్ రెడ్డి, జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి విక్రమ్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉందని తెలిసింది. గోశామహల్ టికెట్‌ను విక్రమ్ గౌడ్ ఆశించారు. అయితే అది రాజాసింగ్‌కు కేటాయించారు. అంబర్ పేట సెగ్మెంట్ నుంచి బరిలోకి గౌతమ్ రావు, ప్రకాష్ రెడ్డి పేర్లు అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ముషీరాబాద్ స్థానంపై పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఇక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినా సహకరిస్తానని లక్ష్మణ్ చెప్పినట్లు సమాచారం. సికింద్రాబాద్ స్థానం మహిళల కోటాలో బండ కార్తీక రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మల్కాజ్ గిరి స్థానం నుంచి ఆకుల రాజేందర్ పేరు వినిపిస్తోంది.
రాజేంద్రనగర్ సీటును తోకల శ్రీనివాస్ రెడ్డికి ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు టాక్. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి బీజేపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. జనసేనకు పొత్తులో ఈ రెండు స్థానాలు కేటాయించవద్దని శేరిలింగంపల్లి, కూకట్ పల్లికి చెందిన బీజేపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు సెగ్మెంట్లపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సిందే. ఇకపోతే ఎల్బీనగర్ సీటుపై సామ రంగారెడ్డి, వంగ మధుసూధన్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు వీరేందర్ గౌడ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ నుంచి విక్రమ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు వినికిడి. మరి మూడో జాబితాలో టికెట్ ఎవరికి వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.