TS: బీజేపీ ఫస్ట్ లిస్ట్ జప్యానికి కారణం ఇదే!
బీజేపీ తొలి విడుత అభ్యర్థుల జాబితాను జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. కానీ విడుదలలో మాత్రం జాప్యం వహిస్తోంది. మంచి ముహూర్తం కోసం అధిష్టానం ఎదురుచూస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ తొలి విడుత అభ్యర్థుల జాబితాను జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. కానీ విడుదలలో మాత్రం జాప్యం వహిస్తోంది. మంచి ముహూర్తం కోసం అధిష్టానం ఎదురుచూస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కానీ బీజేపీ ఖరారు చేసినా ప్రకటించడంలో జాప్యం వహిస్తోంది. దీంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే అధికారికంగా జాబితా ప్రకటించకపోయినప్పటికీ నేతల నుంచి జాబితా ప్రకటించాలని పెరుగుతున్న ఒత్తిడి కారణంగా క్యాండిడేట్లకు నేరుగా ఫోన్ కాల్స్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.
తమకు అసెంబ్లీ టికెట్ ఖరారైందని, ఆయా నియోజకవర్గాలల్లో ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాలని పలువురు ముఖ్య నేతల నుంచి ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రచారాన్ని షురూ చేయాలని, ప్ర్యతర్థి పార్టీలకు దీటుగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. అభ్యర్థులకు స్వయంగా కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జీ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర ఇన్ చార్జీలు సునీల్ బన్సల్ ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలిసింది.