కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై ఈసీ రియాక్షన్ ఇదే!

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ అభ్యర్థుల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Update: 2023-11-23 14:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ అభ్యర్థుల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. మరోవైపు తన వద్దకు వస్తున్న ఫిర్యాదులను విచారించి సదరు అభ్యర్థుల నుంచి వివరణ కోరుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల కేటీఆర్‌పై వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది.

అమరుల స్మారకం వద్ద మంత్రి కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూ విషయం‌పై డీజీపీ అంజనీ కుమార్‌ను సీఈఓ వికాస్ రాజ్ వివరణ కోరారు. ఈ మేరకు డీజీపీకి ఈసీ లేఖ రాసింది. ఇంటర్వ్యూ నిర్వహించడానికి అనుమతి ఎలా ఇచ్చారో పూర్తి వివరాలను వీలైనంత తొందరగా పంపించాలని ఆదేశించారు. కాగా, డీజీపీ ఇచ్చిన వివరణ అనంతరం ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోనుంది. కాగా, అమరవీరుల స్తూపం వద్ద ఇంటర్వ్యూ ఇవ్వటాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీ.నిరంజన్ ఎలక్షన్ కమిషన్‌కు ఈ నెల 16, 22వ తేదీన ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News