TS: ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్
ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు.
దిశ, శేరిలింగంపల్లి: ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్దనున్న కేబుల్ బ్రిడ్జిపై సైక్లింగ్ టు ఓటు - వాక్ టు ఓటు పేరుతో సైకిల్ వాక్తన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే, రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.
సైక్లిస్ట్‌లు, వాకర్స్ ఉత్సాహంగా పాల్గొన్న ఈ సైకిలింగ్ వాకథాన్‌ను నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ రాజీవ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటు హక్కు అనేది ప్రతీ పౌరుడికి ఎంతో ముఖ్యమైన హక్కని దానిని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓటు హక్కుపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఈ కార్యక్రమంలో సైక్లిస్ట్‌లు, వాకర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.