అలర్ట్‌గా ఉండండి.. పోలీసులతో డీజీపీ టెలీ కాన్ఫరెన్స్
కౌంటింగ్నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితికి విఘాతం కలగకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్సూచించారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కౌంటింగ్నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితికి విఘాతం కలగకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్సూచించారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ఇన్నాళ్లూ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని అన్నారు. నేడు రాష్ర్టవ్యాప్తంగా 49 సెంటర్లలో ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో ఆయా కమిషనరేట్ల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో శనివారం ఉదయం డీజీపీ అంజనీకుమార్టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కౌంటింగ్కేంద్రాల వద్ద పరిస్థితిని ఆయా యూనిట్ల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా పార్టీల కార్యకర్తలు కౌంటింగ్సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశాలు ఉంటాయన్నారు. లెక్కింపు చివరి దశకు చేరుకునే సమయంలో విజయం దిశగా సాగుతున్న అభ్యర్థులకు చెందిన అనుచరులు, ఓటమి పాలు కానున్న వారి కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు.
ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. స్పెషల్బ్రాంచ్సిబ్బందిని రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలన్నారు. అవసరమనుకున్న పక్షంలో మొబైల్యూనిట్ల సంఖ్యను పెంచాలని సూచించారు. కౌంటింగ్పూర్తయిన తరువాత గెలిచిన, ఓడిన పార్టీలకు చెందిన వారు ప్రత్యర్థుల ఆస్తులపై దాడులు చేయటానికి అవకాశాలు ఉంటాయన్నారు. అప్పుడు రోడ్ల పక్కన ఉండే భవన నిర్మాణ సామాగ్రి వారికి ఆయుధాలుగా మారే ముప్పు పొంచి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో భవన నిర్మాణ సామాగ్రి అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో పనిచేసిన పోలీసుల కృషిని అభినందించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని కౌంటింగ్రోజున కూడా విధులు నిర్వర్తనలో అలర్ట్‌గా ఉండాలని చెప్పారు.
అన్ని కేంద్రాల్లో...
ఇక, కౌంటింగ్జరుగనున్న 49 కేంద్రాల వద్ద అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే చర్యలు తీసుకోవటానికి ఫైరింజన్లు, ఫైర్ఎస్టింగ్విషర్లు, సిబ్బందిని మోహరించనున్నట్టు అగ్నిమాపక శాఖ డీజీపీ నాగిరెడ్డి తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటానికి గంట ముందే సిబ్బంది ఆయా కౌంటింగ్కేంద్రాల వద్దకు చేరుకుంటారన్నారు. లెక్కింపు పూర్తయ్యే వరకు ఆయా కౌంటింగ్సెంటర్ల వద్దనే విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.