దేశంలో తెలంగాణది అగ్రస్థానం.. ఎన్నికల వేళ నయా రికార్డ్

ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ టాప్​ప్లేస్‌లో నిలిచింంది. దేంట్లో అనుకుంటున్నారా?.. మిగితా రాష్ర్టాలకన్నా ఇక్కడ ఎక్కువ సొత్తు సీజ్​కావటంలో.

Update: 2023-11-20 15:44 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ టాప్​ప్లేస్‌లో నిలిచింంది. దేంట్లో అనుకుంటున్నారా?.. మిగితా రాష్ర్టాలకన్నా ఇక్కడ ఎక్కువ సొత్తు సీజ్​కావటంలో. ఎన్నికల కోడ్​అమల్లోకి వచ్చిన అక్టోబర్​9వ తేదీ నుంచి సోమవారం ఉదయం 9గంటల వరకు తెలంగాణలోని వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో అధికారులు రూ.632.74 కోట్ల సొత్తను స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఒక్క నగదే రూ.236.35 కోట్లు ఉంది. ఇక, 101.57 కోట్ల రూపాయల మద్యాన్ని సీజ్​చేసిన అధికారులు మరో 35 కోట్ల రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 181 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, వెండి, ప్లాటీనం, వజ్రాలను సీజ్​చేశారు. ఓటర్లకు పంచి పెట్టటానికి సిద్ధం చేసి పెట్టుకున్న 78.70 కోట్ల రూపాయల వస్తు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

గత 24 గంటల్లో...

ఆదివారం ఉదయం 9గంటల నుంచి సోమవారం ఉదయం 9గంటల మధ్య అధికారులు రాష్ర్టంలోని వేర్వేరు చోట్ల 3.63కోట్ల రూపాయల నగదును సీజ్​చేశారు. దాంతోపాటు 2 కోట్ల రూపాయల విలువ చేసే 2,190 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు 71 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్​చేశారు. 14లక్షల రూపాయల విలువ చేసే 0.‌‌084 కిలోల బంగారం, 12కిలోల వెండిని సీజ్​చేశారు. 8.45లక్షల రూపాయల విలువ చేసే 90 చీరలను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News