కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్యలో వరల్డ్ కప్.. సాధించేదెవరు?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ నేతలు సైతం వచ్చి తమ తమ పార్టీల సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా పార్టీలు తమ నాయకులే గొప్పంటూ ప్రచారం చేస్తున్నాయి. పార్టీలకు చెందిన సోషల్ మీడియా టీం సభ్యులు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, మీమ్స్, కంటెంట్‌లు క్రియేట్ చేస్తూ పెద్ద ఎత్తున తమ నాయకుడే గొప్ప అంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పెద్ద సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఉభయ పార్టీల సభ్యులు పార్టీలను టార్గెట్ చేస్తు వ్యతిరేకంగా, సపోర్ట్‌గా పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మార్ఫింగ్ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రేపు భారత్, ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా తాజాగా ఉభయ టీం కెప్టెన్‌లు మెట్లబావి వద్ద వరల్డ్ కప్‌తో ఫొటో దిగారు. ఆ ఫొటోను మార్ఫింగ్ చేసి కేసీఆర్, రేవంత్ రెడ్డి ఫొటోలు పెట్టారు. మెన్స్ ఇండియా 2023 తెలంగాణ అని ఉన్న ఫొటో సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఫైనల్ కప్ గెలిచేదెవరో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణ
— 𝙽.𝚃.𝚁🔥𝚈.𝚂.𝚁 🔥𝙹𝙰𝙶𝙰𝙽 (@Ntr__Ysr__Jagan) November 18, 2023
Mens India 2023
Final Cup pic.twitter.com/MAYdQIwRc5