బట్టలు ఊడదీయిస్తా.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల కోసం ఎవరికి లంచాలు ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల కోసం ఎవరికి లంచాలు ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. డబ్బులు ఎవరు అడిగినా చెప్పాలని.. వాళ్లను బట్టలు ఊడదీయిస్తానంటూ కడియం ఘాటు కామెంట్లు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణలో స్టేషన్ ఘన్‌పూర్‌ను నెం.1గా మార్చుతానంటూ హామీనిచ్చారు. కాంగ్రెస్ అంటే అవినీతి, అక్రమాలు చేయడమే అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసని.. జాతీయ పార్టీకి ఒక్క జాతీయ విధానం కూడా లేదంటూ కడియం పేర్కొ్నారు. తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కే గ్యారంటీ లేదు, వారిచ్చే హామీలకు గ్యారంటీ ఉంటుందా? అంటూ కడియం ఫైర్ అయ్యారు.