భద్రత పెంచుతారా? లేదా?.. డీజీపీకి రేవంత్ రెడ్డి లేఖ

భద్రతపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తనకు 6+6 భద్రత కల్పించాలని శుక్రవారం రాసిన లేఖలో డీజీపీని కోరారు. కోర్టు ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ ఇవ్వాలని పేర్కొన్నారు. లేని పక్షంలో హైకోర్టును సంప్రదిస్తానని సూచించారు.

Update: 2023-11-03 14:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: భద్రతపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తనకు 6+6 భద్రత కల్పించాలని శుక్రవారం రాసిన లేఖలో డీజీపీని కోరారు. కోర్టు ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ ఇవ్వాలని పేర్కొన్నారు. లేని పక్షంలో హైకోర్టును సంప్రదిస్తానని సూచించారు. ఎన్నికల ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గత జులైలో తనకు ఉన్న 2+2 భద్రతను సైతం వెనక్కి తీసుకున్నారన్నారు.

తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6+6 భద్రత కల్పించాలని డీజీపీని కోరారు రేవంత్ రెడ్డి. లేదంటే కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద కేసు వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కాగా, గతంలో రేవంత్ రెడ్డి యాత్ర సందర్భంగా సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆదేశించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎంపీ రేవంత్‌కు సెక్యూరిటీ కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారు.

Tags:    

Similar News