ఆ ఆరు సిక్సులే.. ఈ ఆరు గ్యారంటీలు: రేవంత్ రెడ్డి (వీడియో)

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుస చేరికలతో బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం చెప్పడంతో పాటు అధికారం కూడా తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-09-30 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుస చేరికలతో బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం చెప్పడంతో పాటు అధికారం కూడా తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 90 సీట్లు గెలుచుకోబోతోందని స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా.. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

2007 టీ20 ప్రపంచ కప్‌లో భారత ఆల్ రౌండర్ యువరాజ్, ఇంగ్లాండ్ బౌలర్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోపోద్రిక్తుడైన యువీ.. స్టూవర్ట్ బ్రాడ్ వేసిన తర్వాతి ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టి టీమిండియా గెలుపును మరింత సులువు చేశారు. దీనిని ట్విట్టర్ వేదికగా గుర్తుచేసిన రేవంత్.. ఆ ఆరు సిక్సులు భారత జట్టు గెలుపునకు ఎంత కృషి చేశాయో.. టీ.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా వచ్చే ఎన్నికల్లో అంతే ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. టీమిండియా మాదిరి కాంగ్రెస్ గెలుపు ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేయండి అంటూ ట్వీట్టర్ వేదికగా తెలియజేశారు.

Tags:    

Similar News