‘పొర్లు దండాలు పెట్టినా రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలవదు’

‘‘మీకు పాలించే హక్కులేదు. అబద్ధాలే మీ ఆయుధాలుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. రెండుసార్లు ఇప్పటికే మోసం జరిగింది. ఇక మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు” అని టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

Update: 2023-11-05 13:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘మీకు పాలించే హక్కులేదు. అబద్ధాలే మీ ఆయుధాలుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. రెండుసార్లు ఇప్పటికే మోసం జరిగింది. ఇక మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు” అని టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాటకాలు ఇక చెల్లవని ఆయన ఆదివారం ట్వీట్ వేదికగా ఫైర్ అయ్యారు. పదేళ్లుగా ప్రజలు బీఆర్ఎస్ నాటకాలను నమ్మి రోడ్డున పడ్డారని, పేదల పొట్ట కొట్టి కార్పొరేట్స్‌కు పెద్ద పీఠ వేసిన చరిత్ర మోడీ, కేసీఆర్‌లది అన్నారు. కానీ, పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. పేదోడి డెవలప్‌మెంట్ కాంగ్రెస్ ఎజెండా అన్నారు. ప్రజలను వంచనకు గురి చేసిన కేసీఆర్‌ను తెలంగాణ గడ్డ మరువదని, ముక్కు నేలకు రాసినా.. పొర్లి పొర్లి దండాలుపెట్టినా బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదన్నారు. ‘‘పారవు మీ పాచికలు.. తప్పవు మీకు శంకరగిరి మాన్యాలు” అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News