ఎన్నికల వేళ రికార్డు స్థాయిలో పట్టుబడ్డ నగదు, మద్యం.. ఇప్పటివరకు ఎన్ని కోట్లంటే..?

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో

Update: 2023-10-14 14:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేస్తోన్నారు. నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నగదు తరలివస్తుందనే సమాచారంతో మరింత అప్రమత్తమై రాష్ట్ర బోర్డర్లలో కూడా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ తనిఖీలలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతోంది. ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా తరలిస్తున్నవారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఈ నెల 9వ తేదీ ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా.. అప్పటినుంచి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడింది. దాదాపు రూ.74.95 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, గోల్డ్ పట్టుకున్నారు. ఇందులో రూ.48.32 కోట్ల నగదు ఉండగా.. రూ.4.72 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా తరలిస్తున్న బంగారాన్ని కూడా పట్టుకున్నారు. నగదు, బంగారం తీసుకెళ్లేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలను ప్రజలు తమ దగ్గర ఉంచుకోవాలని, లేకపోతే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.


Similar News