MIM పోటీచేసే స్థానాలను నిర్ణయించేది బీజేపీనే: రాహుల్ గాంధీ

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటే టీమ్ అని ఈ మూడు పార్టీలు కలిసే పని చేస్తాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.

Update: 2023-11-28 07:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటే టీమ్ అని ఈ మూడు పార్టీలు కలిసే పని చేస్తాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ చెప్పిన చోటనే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారన్నారన్నారు. మంగళవారం నాంపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ముఖ్యమైన శాఖలను కేసీఆర్ తన చేతిలో ఉంచుకుని ప్రజల సొమ్మును తన జేబులో వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు హామీలతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో దొరల తెలంగాణ పాలన నడుస్తోందని తాము ప్రజల పాలన తీసుకువస్తామన్నారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బీజేపీ విధానం అని బీజేపీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని భారత్ జోడో యాత్ర సమయంలో చూశానన్నారు.

హింస, విద్వేషాన్ని ఆర్ఎస్ఎస్ వ్యాపింపజేస్తోందన్నారు. తప్పుడు కేసులు పెట్టడం ద్వారా బీజేపీ తనను కాంప్రమైజ్ చేయాలని చూస్తోందని నేను మోడీతో కాంప్రమైజ్ అయ్యేది లేదన్నారు. బీజేపీని ప్రశ్నించినందుకు నాపై 24 కేసులు పెట్టారని కానీ ఓవైసీపై ఎన్ని కేసులు? కేసీఆర్ పై ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. 2024లో ఢిల్లీలో మోడీని ఓడించాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించాలన్నారు. కేసీఆర్ దోచుకున్న ప్రజల సొమ్మును తిరిగి ప్రజలకు పంచబోతున్నామన్నారు. కేసీఆర్ కు బై బై చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. బీజేపీ బీసీ వ్యక్తిని సీఎం చేస్తామంటోందని ముందు ఆపార్టీ 2 శాతం ఓట్లు తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌తోనే పోటీ అన్నారు.

Tags:    

Similar News