ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలే: ప్రొఫెసర్ కోదండరాం
గతంలో 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 8 వేల పోస్టులే ఇప్పటివరకు భర్తీ చేశారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. వాస్తవానికి ఇంకో 16 వేల ఖాళీలు ఉండాలని చెప్పారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 8 వేల పోస్టులే ఇప్పటివరకు భర్తీ చేశారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. వాస్తవానికి ఇంకో 16 వేల ఖాళీలు ఉండాలని చెప్పారు. డీఎస్సీ పోస్టులు పెంచాలని, పరీక్షకు 4 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో డీఈడీ, బీఈడీ నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో 13,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అవే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించారు. 5 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లను మూసివేసి.. పోస్టులను సగానికి సగం తగ్గించి.. నేడు 5080 ఉద్యోగాలకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.
అందులో 1300 ఉర్ధూ మీడియం పోస్టులని, మిగిలిన 3780 పోస్టులు వీటికి అప్లికేషన్లు లక్షల్లో వచ్చాయని అభ్యర్థులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలిపారు. ఖచ్చితంగా టీచర్ పోస్టులను పెంచాలని లేదంటే తీవ్రమైన ఆందోళన చేస్తామని, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు కోట్లడుతామని హెచ్చరించారు. తొమ్మిదేళ్ల నుంచి చదివితే ఒక్క డీఎస్సీ వేశారని, సంవత్సరానికి ఒకసారి నిర్వహించాల్సిన టెట్‌ను జరపడం లేదని తెలిపారు. విద్యార్థులపై ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటిఫికేషన్లు కరెక్ట్‌గా నిర్వహించకపోవడం వల్లే గ్రూపు-1 మరోసారి రద్దు అయ్యిందని చెప్పారు. దీంతో అభ్యర్థులు మరోసారి అన్యాయనికి గురువుతున్నారని, ప్రిపరేషన్‌కు ఎంత ఖర్చుపెట్టుకోవాలని విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, నిరుద్యోగులందరిని ఎన్నికల్లో ఒక శక్తిగా మలుచుతామన్నారు.