పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ మీకేం చేసింది?
తెలంగాణలోనే మహిళలపై ఎక్కవగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోనే మహిళలపై ఎక్కవగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జహీరాబాద్ రోడ్ షోలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు. మీరు పదేళ్లనుంచి బీఆర్ఎస్ సర్కార్‌ను చూశారు.. మిమ్మల్ని అడుగుతున్న ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీకేం చేసింది..? ఉద్యోగాలిచ్చిందా? మహిళల అభ్యున్నతి కోసం ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. యువత ఎంతో కష్టపడి చదివితే పేపర్ లీక్‌లు అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణలో భారీగా అవినీతి పెరిగిందని ఆరోపించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి చిన్న చిన్న వాటి దగ్గర కూడా నాయకులు కమీషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల సొమ్ము కొన్ని వేల కోట్లు లూటీ చేస్తున్నారని వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ ధర, నిత్యావసర ధరలు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలతో ఉన్న తెలంగాణలో మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు.