ప్రధాని రోడ్ షో ఎఫెక్ట్.. హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ఉంటడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Update: 2023-11-27 09:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ఉంటడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. అయితే, రోడ్ సో నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రధానమంత్రి మోడీ రోడ్‌ షో నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ నేతలు ప్రచార జోరు పెంచారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ప్రధాని రోడ్డు షో ప్రారంభమై చిక్కడపల్లి, నారాయణగూడ ఫ్లైఓవర్‌, వైఎంసీఏ మీదుగా అంబర్‌పేట నియోజకవర్గం కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్‌ విగ్రహం వరకు కొనసాగనున్నది. అనంతరం ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.

Tags:    

Similar News