బీఆర్ఎస్ నేతలకు లిక్కర్ స్కామ్‌లో లింకులు: ప్రధాని మోడీ

బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో లింకులు ఉన్నాయని, లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్ మాపై ఆరోపణలు చేస్తోంది.

Update: 2023-11-07 13:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో లింకులు ఉన్నాయని, లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్ మాపై ఆరోపణలు చేస్తోంది. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరిని వదిలేదే ప్రసక్తే లేదు. అవినీతి చేస్తే ఖచ్చితంగా జైల్లో వేస్తామని చెప్పారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రసంగించిన మోడీ.. అవినీతి బీఆర్ఎస్ సర్కార్ ను ఇంటి పంపడం ఖాయం అన్నారు. అవినీతిని అంతం చేయడంతో పాటు ప్రజాధనాన్ని ఎవరు దోచుకున్నారో వారిని వదిలిపెట్టేది లేదని, దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి రాబడుతామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ ఏ లు ఒక్కటే అని ఈ రెండు పార్టీలు అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపు రాజకీయాలు ఓకే రకంగా ఉన్నాయన్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సీ టీమ్ అని ఆరోపించిన మోడీ.. గడిచిన 9 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్సీ విరోధి అధికారంలో ఉన్నారని దుయ్యబట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పాటైన బీఆర్ఎస్ సర్కార్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం:

గతంలో తాను ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో తనకు ప్రజల ఆశీర్వదించారు. దాంతో తాను దేశానికి ప్రధాని అయ్యాను. తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడితే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం నా అదృష్టం అన్న మోడీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత స్థానం, గౌరవం ఇచ్చిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీసీ యువత కోసం బీఆర్ఎస్ ఏమి చేయట్లేదు.బీసీలకు రూ.లక్ష ఇస్తామని వాగ్ధానం చేసి నెరవేర్చలేదన్నారు. కానీ తమ పాలనలో మెడికల్, డెంటల్ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు.

ఒక తరం భవిష్యత్ ను బీఆర్ఎస్ నాశనం చేసింది:

ఈ సభలో నిరుద్యోగుల సమస్యను మోడీ ప్రస్తావించారు. బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం వల్ల ఒక తరం భవిష్యత్ నాశనం అయిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ వైఫల్యం వల్ల టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అయ్యాయని, వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయలేదన్నారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందన్న మోడీ.. 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు. తెలంగాణ యువతను మోసం చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్ వెళ్లిపోవాలా? వద్దా అని ప్రశ్నించారు. ఢంకా బజాయించి చెబుతున్న బీఆర్ఎస్ ఇంటికి పోవడం ఖాయమన్నారు.

Tags:    

Similar News