పోస్టల్ బ్యాలెట్లను తరలించడంలో అధికారుల నిర్లక్ష్యం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

Update: 2023-12-02 17:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. 29వ తేదీ నాటి పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను నేటికీ అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించకపోవడంతో విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు భారీగా అక్కడకు చేరుకున్నారు. అనంతరం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. అంతేకాదు.. పోస్టల్ బ్యాలెట్ తరలించిన తరువాతే సీల్ వేసినట్లు సమాచారం. పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్‌కు తాళం లేకపోవడంపై కాంగ్రెస్ నాయకుల తీవ్ర అభ్యంతరం చేశారు.

Tags:    

Similar News