ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన MLC కవిత
గ్రూపు-2 క్యాండిడేట్ ప్రవళిక ఆత్మహత్యపై స్పందిస్తున్న కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కవిత రియాక్ట్ అయ్యారు. ‘‘ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావద్దు. మేము బతుకమ్మ చేస్తాము..
దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-2 క్యాండిడేట్ ప్రవళిక ఆత్మహత్యపై స్పందిస్తున్న కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కవిత రియాక్ట్ అయ్యారు. ‘‘ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావద్దు. మేము బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటాము.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా?, నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా?.
కాంగ్రెస్ కుట్రలకు బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. చివరికి గ్రూప్-2ని వాయిదా వేయాలని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి కూడా ట్విట్టర్లో డిమాండ్ చేయలేదా? శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం’’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు.
బతుకమ్మ చేస్తాము..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023
బాధను కూడా పంచుకుంటాము..
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం...
ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ… https://t.co/ET9YmGPsPW pic.twitter.com/i5Alelsakh