HYD: ప్రగతి భవన్‌ చేరిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్‌ పార్టీ వెనుకంజలో ఉన్నది. అయితే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ఫలితాలను గమనిస్తున్నారు.

Update: 2023-12-03 08:01 GMT
HYD: ప్రగతి భవన్‌ చేరిన ఎమ్మెల్సీ కవిత
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్‌ పార్టీ వెనుకంజలో ఉన్నది. అయితే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ఫలితాలను గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు, ప్రగతి భవన్‌కు చేరకుంటున్నారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఫలితాలల్లో అదే ట్రెండ్ కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కాస్త అసంతృప్తితో ఫలితాలను వీక్షిస్తున్నారు.

Tags:    

Similar News