ఆయన్ను కలిశాకే నెక్ట్స్ స్టెప్ తీసుకోనున్న MLC కవిత?

నెల రోజుల సుదర్ఘ విరామం తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసుల్లో ఇవాళే(శుక్రవారం) విచారణ హాజరుకావాలని పేర్కొన్నారు.

Update: 2023-09-15 04:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: నెల రోజుల సుదర్ఘ విరామం తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసుల్లో ఇవాళే(శుక్రవారం) విచారణ హాజరుకావాలని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదాన్ని కాంగ్రెస్ గట్టిగా ప్రస్తావిస్తున్న తరుణంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.. కాసేపట్లో కవిత ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈడీ ముందుకు ఎలా వెళ్లాలి, ఏం చేయాలో కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తండ్రి సూచన మేరకు కవిత తన తదుపరి అడుగులు వేయనుందని సమాచారం. అంతేగాక, ఇవాళ కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీకి వెళ్లనున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం అటు జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలోనూ చర్చకు దారితీసింది. మార్చి 21న ఆమెను ఈడీ విచారించినా ఆరు నెలల పాటు ఎలాంటి హడావిడీ లేదు. కవితకు వ్యాపార సన్నిహితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్ అప్రూవర్‌గా మారినట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజునే ఆమెకు ఈడీ నుంచి నోటీస్ రావడం రకరకాల చర్చలకు దారితీసింది. పొలిటికల్ పార్టీల్లో జరిగే చర్చలు ఒక రకంగా ఉంటే సామాన్య జనంలో మాత్రం మరో తీరులో ఉన్నాయి. ఈడీ ఎంక్వయిరీకి కవిత హాజరవుతారా?.. అటెండ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది?.. అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Tags:    

Similar News