మల్లారెడ్డికి ఏం తెలియదు.. మొహం మీదే చెప్పేసిన జగ్గారెడ్డి

రాష్ట్ర రాజకీయం సీరియస్‌గా నడుస్తున్న వేళ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ టీవీ ఛానల్‌కు కలిసి ఇంటర్వ్యూ ఇంచ్చారు.

Update: 2023-11-23 13:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయం సీరియస్‌గా నడుస్తున్న వేళ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ టీవీ ఛానల్‌కు కలిసి ఇంటర్వ్యూ ఇంచ్చారు. ఈ సందర్భంగా మాటల తూటాలతో నవ్వులు పూయించారు. తాజా రాజకీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే తమదైన స్టైల్‌లో చేసిన వ్యాఖ్యలు హాస్యం పండించాయి. సోషల్ మీడియాలో నాకన్న ఎవరూ ఫేమస్ లేరని ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఏ పేజీ చూసినా నా పేరే వినిపిస్తోందని, సినీ ప్రముఖుల కన్నా నేనే ఫేమస్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నేను తుమ్మినా తుఫాన్‌గా మారుతోంది చెప్పారు. తనకు కాంగ్రెస్ నేతల మాదిరిగా సీఎం కావాలన్న ఆశలేదన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణ లేని పార్టీని కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారన్నారు. మైనంపల్లి తిరుపతికి వెళ్లి దేవుడి గుడి వద్ద అధిష్టానాన్ని తిట్టి ఔటైపోయాడు.

కాంగ్రెస్‌లో గెలిచిన వాళ్లు బీఆర్ఎస్‌లోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ గురించి మంత్రి మల్లారెడ్డికి ఏమి తెలియదని, నేను ఎంతో మంది నాయకులను చూసి వచ్చాను. మల్లారెడ్డి మనసులో సీఎం కావాలన్న కోరిక ఉన్నా ఆయన చెప్పుకునే అవకాశం ఉండదన్నారు. నాకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డం పడలేదని నేనే వద్దన్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నన్ను అడ్డుకునే వారు ఉన్నారా? అని ప్రశ్నించారు. డైరెక్ట్‌గా సీఎంతో కూర్చునే నేను కావాలనే మంత్రి పదవి తీసుకోవాలని చెప్పగా మల్లారెడ్డి కలుగజేసుకుని సీఎంతో కూర్చోవడం వేరు, కేబినెట్ మంత్రిగా సీఎంతో కూర్చోవడం వేరని, మంత్రి పదవిని మీరే వద్దనుకున్నారా? అంటూ పదే పదే ప్రశ్నించి నవ్వులు పూయించారు. హరీష్ రావుతో నాకు పొలిటికల్ పంచాయతీ మాత్రమేనన్న జగ్గారెడ్డి.. 9 ఏళ్లలో కేసీఆర్ ఏమీ చేయలేదు. అందుకే అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ హవా ఉంటుంది. ఈసారి కాంగ్రెస్‌కు 70 కి పైగా సీట్లు వస్తాయి. కాంగ్రెస్ గెలుపుపై అనుమానాలొద్దు. నేను బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు. నాపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు.

Tags:    

Similar News