RSS నేత రేవంత్ రెడ్డి చేతిలో తెలంగాణ కాంగ్రెస్: KTR

మైనార్టీలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటుందని, 11 సార్లు అధికారం చేపట్టిన సంక్షేమానికి పాటుపడదలేని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో సోమవారం బీఆర్ఎస్ మైనార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మైనారిటీ సంక్షేమానికి అత్యధిక బడ్జెట్ కేటాయించి, వారి సంక్షేమానికి పాటుపడుతున్నామన్నారు.

Update: 2023-10-30 16:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మైనార్టీలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటుందని, 11 సార్లు అధికారం చేపట్టిన సంక్షేమానికి పాటుపడదలేని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో సోమవారం బీఆర్ఎస్ మైనార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మైనారిటీ సంక్షేమానికి అత్యధిక బడ్జెట్ కేటాయించి, వారి సంక్షేమానికి పాటుపడుతున్నామన్నారు. మైనారిటీల కోసం విద్యాసంస్థలు ఏర్పాటు చేసి, మతం, ప్రాంతం, కులం చూడకుండా అందరి సంక్షేమం కోసం పాటుపడిన కేసీఆర్ లాంటి నాయకుడిని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ నేత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆర్ఎస్ఎస్ నేతను ఎందుకు చీఫ్‌గా చేశారని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోనియా గాంధీకి లేఖ రాశారన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు 11 అవకాశాలు ఇస్తే కాంగ్రెస్‌ 11 సార్లు ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. దేశం ఇంకా పేదరికంలో ఉండటానికి కారణం కాంగ్రెస్సే అన్నారు.

కేసీఆర్ పాలనలో "మైనారిటీ వర్గాల ప్రజలు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని గడుపుతున్నాయన్నారు. శాంతి భద్రతలు, సామరస్యం విషయంలో హైదరాబాద్ ప్రతీక అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల మాదిరిగా మత కలహాలు, హత్యాకాండలు చోటుచేసుకోలేదని ఆయన అన్నారు. 'గంగా-జమునా తహజీబ్‌కి హైదరాబాద్‌ పేరుంది' అని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌లోని అందరినీ కలుపుకొని పోయే లౌకిక స్వభావాన్ని ఎత్తిచూపినదన్నారు.. సీఎం కేసీఆర్ ప్రాంతం, మతం, కులాల ప్రాతిపదికన వివక్ష చూపడం లేదన్నారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం దసరా, రంజాన్, క్రిస్మస్ కానుకలను అందజేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News