రజినీకాంత్ పేరు ప్రస్తావిస్తూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సొంతిల్లు లేని పట్టణ పేదలకు గురువారం రెండో దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో నిర్మించిన 133 డబుల్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.
దిశ, సిటి బ్యూరో: సొంతిల్లు లేని పట్టణ పేదలకు గురువారం రెండో దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో నిర్మించిన 133 డబుల్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్‌లో నిర్మించిన ఇండ్లను మున్సిపల్ మంత్రి కేటీఆర్ గురువారం కేటాయించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో మరో 70 వేల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చేందుకు సర్కారు రూ.10,000 కోట్లను వెచ్చించి నిర్మిస్తుందని, ఈ ఇండ్ల కోసం ఎవరూ ఎవరికి పైసా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పేదల సొంతింటి కలలను నిజం చేస్తూ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. సినీ నటుడు రజినీకాంత్‌కు అర్ధమైన అభివృద్ధి విపక్షాలకు అర్థం కాకపోవడం దురదృష్టకరమన్నారు.