ఆ గ్యారంటీలేమో కానీ.. ఐదుగురు సీఎంలు మారడం ఖాయం

కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆరు దశాబ్దాల పాటు కరెంట్ ఇవ్వని వాళ్లు ఇప్పుడొచ్చి గ్యారంటీలు ఇస్తామంటే ఎలా నమ్మాలని విమర్శించారు.

Update: 2023-10-01 07:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆరు దశాబ్దాల పాటు కరెంట్ ఇవ్వని వాళ్లు ఇప్పుడొచ్చి గ్యారంటీలు ఇస్తామంటే ఎలా నమ్మాలని విమర్శించారు. కాంగ్రెస్ వారంటీ ఎప్పుడో అయిపోయిందని అన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే మూడు గంటల కరెంట్ గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. గ్యారంటీగా ఐదేళ్లు ఐదుగురు ముఖ్యమంత్రులు మారడం ఖాయమని తెలిపారు.

ఆకాశం నుంచి బొగ్గు వరకు స్కామ్‌లు కూడా గ్యారంటీ అని తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు అని వెల్లడించారు. ఎన్నికలు రాగానే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసేందుకు కేసీఆర్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి మొడి చెయ్యి పార్టీ.. మరొకటి చెవిలో పువ్వు పార్టీ అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News