మెదక్‌లో డబ్బు సంచులు పనిచేయవు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

డబ్బు సంచులతో మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరు. ఇక్కడ డబ్బులు పనిచేయవని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరారు.

Update: 2023-10-13 05:25 GMT

దిశ, బ్యూరో, సంగారెడ్డి: డబ్బు సంచులతో మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరు. ఇక్కడ డబ్బులు పనిచేయవని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనతో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజలకు సేవ చేయాలి. అలాంటి వారికే స్థానం ఉంటుందన్నారు. పుకార్లు తిప్పికొట్టాలని, బీఆర్ఎస్‌కు హ్యాట్రిక్ విజయం ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పద్మ ఎంతో కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కృషి, పద్మ పట్టుదలతో మెదక్ జిల్లా అయ్యింది. ఇక్కడికి మెడికల్ కాలేజీ వచ్చింది. రైల్ వచ్చిందని మంత్రి గుర్తుచేశారు.

ఘన్‌పూర్ ఆనకట్ట నీళ్ళు వదలాలని ధర్నాలు చేసే రోజులు లేవు. రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నది సీఎం కేసీఆర్. కరెంట్ నిరంతరం ఇస్తున్నారని చెప్పారు. పండుగల వేళ ఎన్నికల పండగ వచ్చింది. రకరకాల వ్యక్తులు వస్తున్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని కేసీఆర్ పండగ చేశారు. పెట్టుబడి నాడు రూపాయి లేని పరిస్థితి. ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తున్నాం. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు. 3 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా, 24 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలో తేల్చు కోవాలన్నారు. ఎండాకాలంలో కూడా పంటకు నీళ్ళు అందుతున్నాయి. గుంట కూడా ఎండటం లేదు.

కంటి వెలుగుతో ప్రతి ఇంట్లో వెలుగు కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం కిసాన్ సమ్మన్ నిధి, హర్ ఘాట్ జల్, కళ్యాణలక్ష్మి, ముగ జీవాలకు అంబులెన్స్. కేంద్రం మనవి కాపీ కొట్టి అమలు చేస్తున్నది. నాడు బెంగాల్ ఉండేది. నేడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరించే పరిస్థితి ఉన్నదని అన్నారు. పద్మ గెలుపు, మెదక్ అభివృద్ధికి మలుపు అని మంత్రి స్పష్టం చేశారు. తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గెలుపు కోసం అందరం కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News