మరో కీలక పథకం ప్రకటించిన మల్లిఖార్జున ఖర్గే

రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. రైతు భరోసా కింద రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Update: 2023-09-17 13:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. రైతు భరోసా కింద రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. అనంతరం కేసీఆర్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక బడ్జెట్‌గా కేసీఆర్ సర్కార్ పక్కన బెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో నడుస్తున్నాయని.. కానీ ఇక్కడ ప్రభుత్వం వాటిని నష్టాల్లోకి మళ్లిస్తోందని కీలక ఆరోపణలు చేశారు. కేసీఆర్ మోడీతో కలిసిపోయారని చెప్పారు. బయట వేరుగా ఉన్నట్లు నటిస్తారు.. కానీ, కలిసే ఉన్నారని స్పష్టం చేశారు. అధికారం కోసం తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు  చేసిన బహిరంగ సభలో పాల్గొని ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News