ప్రచారానికి నేటితో తెర.. డబ్బులు పంపిణీకి రంగం సిద్ధం!
''నియోజకవర్గంలో మన పార్టీకి పరిస్థితి బాగాలేదు ఎక్కడ వెళ్లిన మనల్ని ప్రశ్నిస్తున్నారు.. దాంతో గెలుపు తీరాలకు చేరడం కష్టంగానే ఉంది.
దిశ, బ్యూరో నల్లగొండ: ''నియోజకవర్గంలో మన పార్టీకి పరిస్థితి బాగాలేదు ఎక్కడ వెళ్లిన మనల్ని ప్రశ్నిస్తున్నారు.. దాంతో గెలుపు తీరాలకు చేరడం కష్టంగానే ఉంది.. కాబట్టి ఓట్లకు ఖరీదు కట్టాల్సిందే... అంటూ ముఖ్యమైన ప్రజాప్రతినిధి ఇంట్లో ముగ్గురు నలుగురు నేతల మధ్య చర్చ జరిగింది. ఓటుకు ఎంత ఇవ్వాలని విషయంపై నేతల మధ్య తీవ్రమైన చర్చ జరిగి ఓ నిర్ణయానికి వచ్చారు. దాని ప్రకారమే. సుమారు.1.50లక్షల ఓట్లను కొనుగోలు చేయాలంటూ ఆ చర్చకు ముగింపు పలికారు..." ఈ పరిస్థితిని బట్టి గమనిస్తే ఇప్పటివరకు ప్రచారం చేసిన నేతలు క్షేత్రస్థాయిలో తమ పార్టీకి ఉన్న బలాబలాలను గమనిస్తూ గెలుపు,ఓటములపై ఓ అంచనాకి వచ్చారు. అందుకే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి నేతలు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రచారానికి నేటితో తెర..
15 రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున కొనసాగిన ఎన్నికల ప్రచారం నేటితో ముగింపు పలకనున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు కూడా వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ పల్లె పల్లె తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన ఘనత తమదేఅని, అంతేకాకుండా అధికారంలో ఉన్న తాము రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని చెబుతూనే ఇంకా చేయాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయని వాటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం మూడోసారి కూడా అధికారులకు వచ్చేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు. సీఎం కేసీఆర్,ఐటీ మంత్రి కేటీఆర్ ,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లు వాళ్ళ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పక్షాన అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లాంటి నేతలంతా ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థి పక్షాన ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జిల్లాలో సభలు నిర్వహించి తమ అభ్యర్థులు గెలిపించాలని కోరారు. నేటి సాయంత్రం ఐదు గంటల వరకు ఇప్పటివరకు తిరుగుతున్న ప్రచార రధాలు మైక్ సెట్ లు ర్యాలీలు పూర్తిగా బంద్ చేయనున్నారు ఎన్నికల కమిషన్ విధించిన నిబంధన ప్రకారం అభ్యర్థులు నడుచుకోకపోతే వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.
ఓటుకు రూ.2వేల వరకు డిమాండ్..
ఆయా పార్టీల అభ్యర్థులు వాళ్ళ నాయకులు ఇన్నాళ్లు చేసిన ఎన్నికల ప్రచారంతో అభ్యర్థుల గెలుపు లపై ఓ నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఓటరును ఆకర్షించేందుకు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునేందుకు నేతలు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాలలో తమకు అనుకూలమైన వాతావరణం కల్పించిన డబ్బుల పంపిణీ తో ఎక్కడ ఓటర్లు మనసు చెదిరిపోతుందోనని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. అందుకే ఓటర్లకు డబ్బులు ఇయ్యాలని స్పష్టమైన నిర్ణయానికి అన్ని ప్రధాన పార్టీ నాయకులు వచ్చినట్లు సమాచారం. అయితే ఇందులో ఎటుపక్ష వాళ్ళు ఓటుకు ఎంత డబ్బు ఇవ్వన్నారో దానికంటే కొంత మెరుగ్గా చేసి ఓట్లు రాబట్టుకోవాలని మరొక పార్టీ పన్నాగం పన్నుతున్నట్లు ప్రచారం.
ఇప్పటికే ఓ పార్టీ ఓటుకు రూ.1000లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.. ఆ క్రమంలోనే మరొక పార్టీ రూ. 1500 నుంచి 2000 ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయకుండా ఉండాలనే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ప్రధాన పార్టీలు1 లక్ష నుంచి 1.50 లక్షల వరకు ఓట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డట్టు సమాచారం.. ఓటర్లకు పెంచాల్సిన డబ్బులు ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి డంపు చేసినట్లు సమాచారం. డబ్బులు ఇచ్చే ముందు పార్టీతో సంబంధం లేకుండా అందరికీ సొమ్ము ముట్టు చెబితే ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావంలో ఇరు పార్టీల అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. ఇదే కాకుండా ఇప్పటికే గ్రామాలలో మద్యం సీసాలు కూడా డంపు చేసినట్లు తెలుస్తోంది.. 15 రోజులుగా డబ్బుల ఖర్చుకు ఇష్టం లేని నేతలు ఈ రెండు రోజుల్లో ఎంత సొమ్ము ఖర్చు అయినా సరే తాము గెలవాల్సిందేనని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.