ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. కీలక నేతపై సస్పెన్షన్ వేటు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కొత్త మనోహర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాష్ట్ర స్థాయి నేతలపై నిరాధార ఆరోపణలు, బహిరంగ ప్రకటనలు చేసినందున బుధవారం ఆయనపై వేటు వేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కొత్త మనోహర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాష్ట్ర స్థాయి నేతలపై నిరాధార ఆరోపణలు, బహిరంగ ప్రకటనలు చేసినందున బుధవారం ఆయనపై వేటు వేసింది. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కొత్త మనోహర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎవరైనా పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, పార్టీ సీనియర్ల పేర్లు ప్రస్తావించడం సరైంది కాదని హెచ్చరించారు. పార్టీలో అంతర్గత సమస్యలేవైనా ఉంటే ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే, ఏఐసీసీ పెద్దలతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలే తప్ప మీడియా ముఖంగా బహిరంగ ప్రకటలు చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. కాగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిలో కొత్త మనోహర్ రెడ్డి కూడా ఉన్నారు.