ఎన్నికల వేళ బీజేపీకి BIG షాక్.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హర్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హర్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ మార్పు విషయమై తన ముఖ్య అనుచరులతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని అనుకుంటున్నాను. కానీ, మునుగోడు ప్రజలు నాపై ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచే పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఉప ఎన్నికలకు ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది.’ అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆయన బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. నిన్న బీజేపీ విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్‌లోనూ ఆయన పేరు లేకపోవడం గమనార్హం.