పటేల్ రమేష్‌రెడ్డికి ఖర్గే కీలక హామీ
పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపడం సంతోషంగా ఉన్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపడం సంతోషంగా ఉన్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. నామినేషన్ ఉప సంహరించుకున్న రమేష్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రత్యేకంగా కలిశారు. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ పవర్‌లోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేయాల్సిందిగా ఖర్గే కోరారు. దీనికి పటేల్ రమేష్ రెడ్డి అంగీకరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు థాక్రే, అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, పటేల్ రమేష్ రెడ్డి సోదరులు పాల్గొన్నారు.