ప్రభుత్వ ‘గృహలక్ష్మీ’ పథకంపై కీలక అప్డేట్
ఎన్నికల సమీపిస్తోన్న వేళ తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సమీపిస్తోన్న వేళ తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించింది. కాగా, ఈ డబ్బులు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతోందని వెల్లడించారు. అతి త్వరలో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మొత్తం 3,65,975 మంది లబ్ధిదారులను గుర్తించి, మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. మరో 35 వేల మందికి సీఎం కోటా కింద మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది.