బీజేపీని తక్కువ చేసి మాట్లాడిన కేటీఆర్
బీజేపీ పార్టీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా లేదని.. కాంగ్రెస్‌తోనే మాకు పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పార్టీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా లేదని.. కాంగ్రెస్‌తోనే మాకు పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాము చేసిన అభివృద్ధే బీఆర్ఎస్‌ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ లాంటి నాయకుడ్ని ఎవరూ వదులుకోరని చెప్పారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే కర్ణాటకలో కరెంట్ కష్టాలు ఏర్పడ్డాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైనందున, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ అసమర్థత గురించి తెలుసని, దశాబ్దాలుగా ఆ బాధలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు కర్ణాటకలో రైతులు ఆ బాధలు అనుభవిస్తున్నారని అన్నారు. ‘మా పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించాం. 95 శాతం మందికి బీ ఫామ్‌లు ఇచ్చాం. తాము చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. మిగతా పార్టీలు అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావు’ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ శ్రేణులు బీజేపీని తక్కువ చేసి మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.