కాంగ్రెస్ అసంతృప్తులకు కేసీ వేణుగోపాల్ కీలక హామీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల బుజ్జగింపులు కొలిక్కి వచ్చినట్లుగా కన్పిస్తున్నాయి. టికెట్ రాని 20 మంది నేతలతో తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల బుజ్జగింపులు కొలిక్కి వచ్చినట్లుగా కన్పిస్తున్నాయి. టికెట్ రాని 20 మంది నేతలతో తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ఎన్ఎస్యూఐ నేత వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, బలరాం నాయక్, పారిజాత నరసింహారెడ్డితో సహా 20 మందికి కేసీ వేణుగోపాల్ భరోసా ఇచ్చారు. టికెట్ రాలేదని అధైర్య పడొద్దని, తెలంగాణలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం రాబోతోందని కేసీ తెలిపారు. ఎవరిని చూసి ఇబ్బంది పడొద్దని, ప్రభుత్వంలో టికెట్ రాని నేతలు కూడా భాగస్వామ్యం అవుతారని కేసీ తెలిపారు. ‘మీ రాజకీయ భవిష్యత్తు బాధ్యత నాదే’ అని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని సమాచారం. మరోవైపు తుంగతుర్తి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తాజాగా తెలిపారు.