కేసీఆర్‌ సర్కార్‌పై కన్హయ్య కుమార్ విమర్శలు

బీఆర్ఎస్ ప్రభుత్వం అమరులను మ్యూజియంకే పరిమితం చేసిందని ఎన్‌ఎస్‌యూఐ నేషనల్ ఇన్‌చార్జ్ కన్నయ్య కుమార్ పేర్కొన్నారు. వాళ్ల ఆశయాలు, ఆకాంక్షలను ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం దారుణమన్నారు.

Update: 2023-11-26 17:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం అమరులను మ్యూజియంకే పరిమితం చేసిందని ఎన్‌ఎస్‌యూఐ నేషనల్ ఇన్‌చార్జ్ కన్నయ్య కుమార్ పేర్కొన్నారు. వాళ్ల ఆశయాలు, ఆకాంక్షలను ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. పదేళ్లలో ఉద్యోగాలు భర్తీ కాలేదన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ రాగానే రెండు లక్షల జాబ్‌లు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. విద్య, రిక్రూట్ మెంట్ వ్యవస్థను బీఆర్ ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందన్నారు.

ప్రవళికది ఆత్మహత్య కాదని, ఇది సర్కార్ చేసిన హత్య అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది కీలక పోరాటమని, నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఫైట్ చేస్తే, విద్యార్ధులను కేసీఆర్ మోసం చేశాడన్నారు. పదేండ్లలో ఉద్యోగాల కల్పన సక్రమంగా జరగలేదన్నారు. కేజీ టు పీజీ అని విద్యను వ్యాపారం చేశారన్నారు. పేపర్ లీకులతో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఆందోళన చేసిన విద్యార్థులను జైల్‌లో పెట్టడం బాధాకరమన్నారు.

Tags:    

Similar News