BRS ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పల్లాకు స్ట్రాంగ్ వార్నింగ్

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనగామ బీఆర్ఎస్‌లో వర్గపోరు ఎక్కువైందని మండిపడ్డారు.

Update: 2023-10-01 04:23 GMT
BRS ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పల్లాకు స్ట్రాంగ్ వార్నింగ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనగామ బీఆర్ఎస్‌లో వర్గపోరు ఎక్కువైందని మండిపడ్డారు. మహాభారతం, రామాయణంలోని ఘట్టాలను వివరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ద్రౌపది వస్త్రభరణాన్ని మించి ఘోరంగా జనగామలో రాజకీయ కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా మంత్రి కేటీఆర్ చెప్పినా ఈ కుట్రలు ఏంటని పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ఆదేశాలను ధిక్కరించి సమావేశం ఎలా నిర్వహిస్తారని ముత్తిరెడ్డి ప్రశ్నించారు. జనగామలో కేవలం కేసీఆర్ వర్గం తప్ప మరో వర్గం లేదని.. కేసీఆర్ శరీరంలో ముత్తిరెడ్డి ఒకరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానిని రెండు ముక్కలు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Tags:    

Similar News