ఎంపీపై హత్యాయత్నం ఎఫెక్ట్: రాష్ట్ర పోలీసు శాఖ సంచలన నిర్ణయం

అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రతను పెంచుతూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. దుబ్బాక స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-10-31 12:49 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రతను పెంచుతూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. దుబ్బాక స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్​పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీలో ఉన్న అభ్యర్థులకు వెంటనే భద్రతను పెంచాలంటూ అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) అన్ని కమిషనరేట్ల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న టూ ప్లస్​టూ భద్రతను ఫోర్​ప్లస్​ఫోర్‌కు పెంచాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా త్రీ ప్లస్​త్రీ ఉన్న భద్రతను ఫోర్​ప్లస్ ఫోర్‌కు పెంచాలని సూచించారు.

Tags:    

Similar News