ఎంపీపై దాడిని ఖండించిన గవర్నర్.. డీజీపీకి కీలక ఆదేశాలు
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. ఇక నుంచి సెక్యూరిటీ చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలంటూ డీజీపీని ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. ఇక నుంచి సెక్యూరిటీ చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలంటూ డీజీపీని ఆదేశించారు. ప్రస్తుతం జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలు వంటిదని ఒక ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులకు, ప్రచారంలో పాల్గొనేవారి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలంటే పోలీసు భద్రత పటిష్టంగా ఉండాలని సూచించారు. గాయాలపాలైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య చికిత్స లభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.