తెలంగాణ సర్కార్‌పై గోవా ముఖ్యమంత్రి సీరియస్ కామెంట్స్

రాష్ట్రం కోసం 1200 మంది ప్రాణాలు కోల్పోయారని, ఆ బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ విమర్శలు చేశారు.

Update: 2023-11-06 16:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం కోసం 1200 మంది ప్రాణాలు కోల్పోయారని, ఆ బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ విమర్శలు చేశారు. అదే బీజేపీ రక్తం చిందకుండా చత్తీస్ గఢ్, జార్ఖండ్ ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. 1200 మంది బలిదానాలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అవినీతి, కమీషన్ల పార్టీ అని ఆగ్రమం వ్యక్తం చేశారు. సోమాజిగూడలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలను అందించడంలో రాష్ట్ర సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.

ఒక్క పరీక్ష కూడా నిర్వంచలేని అసమర్థ ప్రభుత్వమని, బీఆర్ఎస్ సర్కారు అవినీతిమయమైందని గోవా సీఎం ఆరోపణలుఏ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, నాణేనికి బొమ్మ, బొరుసులాంటివని ప్రమోద్ పాండురంగ సావంత్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని, కలిసి పని చేశాయని ఆయన ఫైరయ్యారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరముందని ఆయన వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే ఉత్తరాది రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పసుపు బోర్డు, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చిందని, జాతీయ రహదారులను అభివృద్ధి చేసిందని ఆయన మోడీ పాలనను కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ బీజేపీ అధికారంలోకి వస్తే నెరవేరుస్తుందని, బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కోరారు.

Tags:    

Similar News