ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు BIG స్కెచ్

అసెంబ్లీ ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల కమిషన్​నిఘా పెట్టింది.

Update: 2023-10-14 04:07 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల కమిషన్​నిఘా పెట్టింది. ఎలక్షన్ల బరిలో ఉన్న ఆయా పక్షాల అభ్యర్థులు చేసే ఖర్చులకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు సీఐడీ అదనపు డీజీ మహేశ్​మురళీధర్​భగవత్‌కు అప్పగించింది. ఇక, స్టేట్​పోలీస్​నోడల్​ఆఫీసర్‌గా అదనపు డీజీ (లా అండ్​ఆర్డర్) సంజయ్​జైన్​వ్యవహరించనున్నారు. ఎలక్షన్​నోటిఫికేషన్​వెలువడిన వెంటనే ఇప్పటికే ఖరారైన బీఆర్ఎస్​అభ్యర్థులు ప్రచారాన్ని జోరు చేసిన విషయం తెలిసిందే.

ఇక, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించకున్నా ఆశావహులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాగా, ఈసారి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు రూ.40 లక్షలకు మించి ఖర్చు చేయరాదని ఎన్నికల కమిషన్​స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అభ్యర్థుల ఖర్చుల వివరాలను తెలుసుకునే బాధ్యతలను సీఐడీ అదనపు డీజీ మహేశ్​మురళీధర్​భగవత్‌కు అప్పగించింది. ఇక, పోలీసు శాఖ తరఫున అదనపు డీజీపీ (లా అండ్​ఆర్డర్) ఎన్నికల నోడల్​అధికారిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Tags:    

Similar News