ఆ లెటర్ ఫేక్.. ఫాక్స్ కాన్‌కు లేఖ ప్రచారంపై డీకే రియాక్షన్

ఫాక్స్ కాన్ గ్రూప్ లకు తాను లేఖ రాసినట్లు జరుగుతున్న ప్రచారంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రచారం అంతా ఫేక్ అని కొట్టిపారేశారు.

Update: 2023-11-04 11:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఫాక్స్ కాన్ గ్రూప్ లకు తాను లేఖ రాసినట్లు జరుగుతున్న ప్రచారంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రచారం అంతా ఫేక్ అని కొట్టిపారేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. యాపిల్‌ ఎయిర్‌పాడ్‌ తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్‌కాన్‌ సంస్థకు తాను రాసినదంటూ ప్రచారం చేస్తునన లేఖ నకిలీదన్నారు. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డీకే శివకుమార్ లేఖ వ్యవహారం తెలంగాణలో రాజకీయ దుమారంగా మారింది. డీకే రాశారంటూ ఓ లేఖను బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ఎంతో కష్టపడి మనం ఫాక్స్ కాన్ కంపెనీని తెలంగాణకు తీసుకువచ్చాం. ఫాక్స్ కాన్ సీఈవో కూడా ఇక్కడ కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కంపెనీ ప్రారంభానికి కొద్ది రోజుల సమయం ఉంది. కానీ డీకే శివకుమార్ ఫాక్స్ కాన్ సీఈవోకు లేఖను రాసి ఆ కంపెనీని బెంగళూరుకు మార్చాలని కోరుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ పరిశ్రమలన్ని కర్నాటకకు తరలించుకుపోతారని ఆరోపించారు.



Tags:    

Similar News