ఈసీ బదిలీ చేసిన ఒక్కో పోస్టుకు ముగ్గురు
రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణ నుంచి 20 మంది అధికారులను తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయంతో ఖాళీ అయిన ఈ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్ ను గురువారం సీఎస్ శాంతి కుమారి ఈసీకి పంపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణ నుంచి 20 మంది అధికారులను తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయంతో ఖాళీ అయిన ఈ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్ ను గురువారం సీఎస్ శాంతి కుమారి ఈసీకి పంపించారు. సీనియార్టీ ప్రాతిపదికన అధికారుల పేర్లును ఈసీఐ, సీఈవోకి జాబితాను పంపించారు.
ఈ ప్యానెల్ నుంచి ఒక్కొక్కరిని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేయనుంది. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీసు కమిషనర్లు, పది మంది ఎస్పీలతో పాటు రవాణా శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల కమిషనర్, అబ్కారీ డైరెక్టర్‌లను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని స్పష్టం చేసింది.