రహస్య ఒప్పందం బట్టబయలైంది.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నారాయణ మీడియాతో మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నారాయణ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలపై దాడుల విషయంలో బీఆర్ఎస్-బీజేపీ అవగాహనతో ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలపై దాడులు జరుపడంతో వీరి మధ్య ఉన్న అంతర్గత ఒప్పందం మరోసారి బయటపడిందని విమర్శించారు. కాగా, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో ఐటీ దాడులు జరిగాయి. సుమారు ఏడు గంటల పాటు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలోనూ సోదాలు చేశారు. ఈ క్రమంలో పొంగులేటి సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ఐటీ దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.