తెలంగాణలో కాంగ్రెస్ ముందంజ.. సెకండ్ ప్లేస్‌లో బీఆర్ఎస్

తెలంగాణ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఓట్లలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది.

Update: 2023-12-03 02:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఓట్లలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు తలోచోట ముందంజలో కొనసాగుతున్నాయి. కాగా, 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను, లక్షా 80 వేల ఓట్లు పోల్ అయ్యాయి. మరోవైపు అధికార బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందజంలో ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాతో ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపుపై ఇటు అధికార బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ధీమాతో ఉండగా, బీజేపీ సైతం మెరుగైన ఫలితాలు ఆశిస్తోంది. కౌంటింగ్ సందర్భంగా భారీగా కేంద్ర భద్రతా బలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలను మోహరించారు.

Tags:    

Similar News