సమాచారం ఇవ్వకుండా తొలగించడం ఏంటి.. మున్సిపల్ కమిషనర్‌పై సీరియస్
మున్సిపల్ కమిషనర్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడంపై సీరియస్ అయ్యారు.
దిశ, వర్ధన్నపేట: మున్సిపల్ కమిషనర్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడంపై సీరియస్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెప్పు చేతుల్లో మున్సిపల్ కమిషనర్ పనిచేస్తున్నారని అన్నారు.
మున్సిపాలిటీలో అక్రమాలు జరిగాయని త్వరలో వాటిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మాజీ ప్రధాని, జాతిపిత మహాత్మాగాంధీ, తెలంగాణ తల్లి విగ్రహలను ఇంగీత జ్ఞానం లేకుండా ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టారీతిన తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పులో భాగంగా ఇల్లు కోల్పోయిన దళితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యే అయి ఉండి దళితులపై ప్రేమ చూపడం లేదన్నారు.